తెలుగు ఆడియెన్స్ కోసం ప్రతి శుక్రవారం థియేటర్స్ లోకి సినిమాలు వచ్చి సందడి చేస్తుండగా ఈ శుక్రవారం సందడి చేసేందుకు కూడా కొన్ని సినెమాలు రెడీ గా ఉన్నాయి. అయితే వీటిలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం “రొమాంటిక్” కూడా ఒకటి. అలాగే ఈ సినిమాకి స్వయంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రమోషన్స్ కి దిగడం సినిమాకి మరింత మైలేజ్ ఇచ్చింది.
అయితే నిన్న ప్రభాస్ తో కలిసి ఆకాష్ ఈ సినిమా హీరోయిన్ లు ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది. ఆకాష్ కేతికను ఉద్దేసించి ఆమె మంచి సింగర్ అంటే అప్పుడు ఆమె నేను జస్ట్ బాత్రూం సింగర్ ని అంటుంది పర్లేదు పాట పాడు అని ప్రభాస్ అంటాడు.
అప్పుడు ఆకాష్ నువ్ నీ బాత్రూం లోనే ఉన్నావ్ అనుకో నేను లేను డార్లింగ్ కూడా లేడు అనుకోని పాడేయ్ అన్నాడు. అపుడు ప్రభాస్ రిప్లై.. నేను ఆ అమ్మాయి బాత్రూం లో ఎందుకు ఉంటా డార్లింగ్ అని అదిరే రిప్లై ఇచ్చాడు. కళ్ళు మూసుకొని గజాలా పాడేయ్ అంటూ కామెంట్ చేసాడు. దీనితో ప్రభాస్ హిలేరియస్ కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.