Prabhas : ఏకంగా ఏడు ఎకరాల్లో ప్రభాస్ బిగ్గెస్ట్ సినిమా షూట్.!

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ చేపట్టిన భారీ చిత్రాల్లో ప్రపంచ స్థాయిలో తెరకెక్కి రిలీజ్ కానున్న ఏకైక చిత్రం ఒకటి ఉంది. అదే “ప్రాజెక్ట్ కె” యంగ్ అండ్ టాలెంటడ్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మన దేశంలోనే కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

అయితే ఈ భారీ సినిమా ఇది వరకే ప్రభాస్ లేకుండా బాలీవుడ్ బిగ్ స్టార్స్ అమితాబ్ మరియు దీపికా పదుకొనెలతో షూటింగ్ ని స్టార్ట్ చేసిన దర్శకుడు ఇప్పుడు ఒక భారీ షెడ్యూల్ ని స్టార్ట్ చేయబోతున్నాడట. రేపు హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారట.

మరి ఈ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏకంగా ఏడు ఎకరాల్లో ప్లేస్ ని తీసుకొని చేయనున్నారట. భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దీనిని ప్లాన్ ప్రపంచ స్థాయిలో తెరకెక్కిస్తుండగా.. ఆల్రెడీ దీపికా పదుకొనె హైదరాబాద్ కి వచ్చి చేరుకుంది. మరి ఈ వరల్డ్ క్లాస్ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.