Prabhas : ప్రభాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ని అప్పటికి టార్గెట్ చేస్తున్నారట.!

Prabhas :  ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ హాట్ టాపిక్ గా నిలిచే హీరోల పేర్లు అలాగే సినిమాలు విషయానికి వస్తే చాలా తక్కువే వినిపిస్థాయి. మరి వాటిలో హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు అలాగే మోస్ట్ అవైటెడ్ సినిమాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” అని చెప్పాలి.

మరి ఇలాంటి ఇద్దరు ఇండియన్ సినిమా దగ్గర ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులు కలిపి ఒక సినిమా చేస్తే అదెలా ఉంటుందో చూపించడానికి “సలార్” సినిమాతో వీరు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సినిమా ఇండియా సినిమాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఈ కొన్ని రోజుల్లోనే లాస్ట్ షెడ్యూల్ అందులోని పెద్ద షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యాల్సి ఉంది కానీ ఇది అందాకా మళ్ళీ ఆలస్యం అయ్యింది. మరి ఇదిలా ఉంటే ఈ భారీ సినిమాపై ఇంకో సాలిడ్ బజ్ వినిపిస్తుంది.

అన్నీ కానీ కరెక్ట్ గా జరిగితే ఈ సినిమాని ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని చిత్ర బృందం టార్గెట్ పెట్టుకున్నారట. మరి ఇదే కానీ జరిగితే ప్రభాస్ నుంచి రెండు లేదా మూడు సినిమాలు ఈ ఒక్క ఏడాదిలోనే చూడడం పక్కా అని చెప్పాలి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దాదాపు కేజీఎఫ్ బృందమే ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.