భగత్ సింగ్ గా ప్రభాస్?

‘బాహుబలి’ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ‘రాధే శ్యామ్’ సినిమా ప్లాప్ ఐనప్పటికి ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలతో ప్రస్తుతం బిజీ గా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సందీప్ వంగ ‘స్పిరిట్’, అలాగే మారుతీ తో ఒక సినిమా చేయనున్నాడు.

అయితే తాజాగా కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాకు డైలాగులు రాసిన యువ రచయిత వాసుదేవ్ ప్రభాస్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అని తెలిపారు. తాను ప్రభాస్ కోసం ఇప్పటికీ ఒక మంచి కథ కూడా రెడీ చేసానని, అలాగే తనకి స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆదర్శం అని తెలిపారు. ఎప్పటికైనా భగత్ సింగ్ కథని నా సినిమాలో చెప్పాలని అనుకుంటున్నా. ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకుని కథ కూడా రెడీ చేశా. భగత్ సింగ్ చనిపోయిన నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. భగత్ సింగ్ పాత్రకి ప్రభాస్ బాగా సరిపోతారు అని వాసుదేవ్ అన్నారు.

హిందీ లో భగత్ సింగ్ మీద కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ తెలుగు లో ఇప్పటివరకు భగత్ సింగ్ మీద సినిమాలు రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా అంటే కనీసం నాలుగు, ఐదు సంవత్సరాలు సమయం పట్టొచ్చు.