Prabhas: హైదరాబాద్ లో నూతన గృహానికి శ్రీకారం చుట్టిన రెబల్ స్టార్.. ఏకంగా 200 కోట్లతో!

Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ నిత్యం హైదరాబాద్ మొబైల్లో నివాసముంటున్నారు. ఇలా ఎక్కువగా ముంబైలో ఉండాల్సి రావడం వల్ల గత కొన్ని రోజుల క్రితం ప్రభాస్ ముంబైలో ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఇప్పటికే ప్రభాస్ హైదరాబాద్ లో ఇల్లు ఉండగా తాజాగా మరో కొత్త ఇంటిని నిర్మించాలి అని భావిస్తున్నారట. అందుకోసమే ఏకంగా రెండు వందల కోట్లు ఖర్చు చేసి ఎంతో అందమైన విల్లాను నిర్మించాలని ఈ డార్లింగ్ భావించారు. ప్రభాస్ తన కొత్త ఇంటిని నిర్మించడం కోసం నానక్ రామ్ గూడ సినీ విలేజ్లో ఈ విల్లాను నిర్మించాలని భావించారట. అందుకోసమే ప్రభాస్అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో 120 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండడంతో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ ఇంటి నిర్మించాలనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.

అందుకోసమే 120 కోట్లు పెట్టి స్థలం కొనుగోలు చేయడమే కాకుండా ఇక్కడ సుమారు 80 కోట్ల వరకు ఖర్చు చేసి తను ఒక ఫామ్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.