“రాధే శ్యామ్” టీజర్ విజువల్ బొనాంజా..ప్రభాస్ హైలైట్

 

పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం “రాధే శ్యామ్” నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. మరి ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం. ముందు నుంచి చెప్పినట్టుగానే ఈ టీజర్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంది.

అలానే ప్రభాస్ తన పాత్రను పరిచయం చేసుకుంటూ పలికించిన ఇంగ్లీష్ డైలాగ్స్ అలానే తన లుక్స్ కానీ సింపుల్ గా చాలా నీట్ గా ఉన్నాయి. కానీ ప్రభాస్ తన కోసం రివీల్ చేసిన అంశాలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. తాను అందరి భవిష్యత్తు చెప్పేవాడిగా దేవుడిని కాను కానీ అన్నీ నాకు తెలుస్తాయి అందరి కోసం తెలుసు అనేవి తన పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేస్తుంది.

ఇక అలానే ఇందులో కనిపించిన కొన్ని విజువల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. మొత్తానికి మాత్రం దర్శకుడు రాధా కృష్ణ ప్రభాస్ తో చేసిన ప్లానింగ్ బాగానే ఉందని చెప్పొచ్చు. అలానే ఈ టీజర్ లో జనవరి 14 నే సినిమా రిలీజ్ అవుతున్నట్టు మరోసారి ప్రకటించారు.