‎Spirit: ప్రభాస్ స్పిరిట్‌ మూవీ నుంచి మైండ్ అదిరిపోయే అప్‌డేట్!

‎Spirit: టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా పూర్తి కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్నాయి.

‎ఇది ఇలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ప్రభాస్ నెక్ట్స్ చేయబోయే మూవీ కూడా స్పిరిట్ అంటున్నారు మేకర్స్. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. మొన్నా ఆ మధ్య నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఇదే చెప్పారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసారు సందీప్ వంగా.

‎అంతేకాదు మెక్సికో సహా మరికొన్ని ఫారెన్ కంట్రీస్‌ లో లొకేషన్స్ రెక్కీ కూడా అయిపోయింది. ఎక్కువ భాగం విదేశాల్లోనే షూట్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. అలాగే స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయట. మూడు పాటలు కూడా కంపోజ్ చేసారు హర్షవర్ధన్ రామేశ్వర్. షూట్ కూడా ఒక్కసారి మొదలయ్యాక నో బ్రేక్స్ అంటున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ 90 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. 2026 సెకండాఫ్‌ లో స్పిరిట్ విడుదల కానుందట. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.అలాగే ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు.