యూఎస్ గడ్డపై “బిల్లా” తో ప్రభాస్ ఆల్ టైం రికార్డు.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ స్టార్డం ఉన్నటువంటి హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. అయితే ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేసిన సినిమాలు ఏమో కానీ ఆల్రెడీ చేసి హిట్ కొట్టిన సినిమా ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రభాస్ కెరీర్ లో వచ్చిన హిట్ చిత్రాల్లో దర్శకుడు మెహర్ రమేష్ తో తీసిన ఒక స్టైలిష్ ఏక్షన్ గ్యాంగ్ స్టార్ డ్రామా “బిల్లా” కూడా ఒకటి. ప్రభాస్ కెరీర్ లో ఇది మంచి హిట్ కాగా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ట్ అయినటువంటి రీ రిలీజ్ ట్రెండ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఈ రీ రిలీజ్ తో యూఎస్ గడ్డపై భారీ రికార్డు నెలకొల్పినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 22న షోలు ప్లాన్ చేసుకోగా యూఎస్ లో ఈ సినిమా ఇప్పటి వరకు జరిగిన అన్ని రీ రిలీజ్ సినిమాల కంటే అధిక స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ప్రభాస్ ఈ రకంగా ఆల్ టైం రికార్డు అందుకున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ నమిత కూడా నటించింది. అలాగే మణిశర్మ సూపర్ సంగీతం దీనికి ఇవ్వగా స్వర్గీయ కృష్ణం రాజు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు.