తనకి ప్రదీప్ తో ఉన్న సంబంధం గురించి బయటపెట్టిన పూర్ణ .!

రవి బాబు నిర్మించిన “అవును” సినిమా ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన పూర్ణ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అయితే ఇటీవల మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి ఇటూ బుల్లితెర మీద అటూ వెండి తెర మీద సందడి మొదలు పెట్టింది. ఇక మొన్నటి వరకు ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో లో జడ్జిగా వ్యవహరించింది. ఈ షో లో పూర్ణ అందరికీ హగ్గులూ, ముద్దులు ఇస్తు బాగా పాపులర్ అయ్యింది. కొన్ని సందర్భాలలో ఈమె చేసే పనులకు విసుగు చెందిన ప్రేక్షకులు విమర్శలతో దాడి చేశారు. అయితే కొంతకాలంగా పూర్ణ ఢీ షోలో కనిపించటం లేదు.

ప్రస్తుతం పూర్ణ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ గారి స్థానంలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో కూడా పూర్ణ హంగామా మామూలుగా లేదు. ఇదివరకే ఒకసారి ఆది ముద్దు అడగటంతో అక్కడ ఇలా ముద్దులు, హగ్గులు ఇవ్వలేక ఢీ షో మానేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇంకో సందర్భంలో ఇమ్మానియేల్ పూర్ణ మీద చేయి వేయటంతో అతని మీద ఫైర్ అయ్యింది. ఇటీవల శ్రీదేవీ డ్రామా షో వారు పెళ్ళాం చెబితే వినాలి అనే కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఈ షో లో జబర్ధస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు బుల్లితెర నటులు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఇక ఈ షో లో ఆది రష్మి ని బాగా ఏడిపించాడు. రష్మీ ఏం చేసినా కూడా వెంటనే ఫోన్ మట్లాడుతున్నట్టుగా నటిస్తూ బాబు.. ఇప్పుడు పాప అదరగొట్టేసింది.. సెంటర్‌కు వెళ్లింది.. డ్యాన్స్ చేసింది అంటూ ఇలా లైవ్ అప్డేట్ లు ఇచ్చాడు. అలా రష్మి ని ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో మధ్యలో పూర్ణ మీద కూడా కౌంటర్లు వేసాడు. అయితే పూర్ణ అందుకు స్పందిస్తూ..అదేంటి నా గురించి సుధీర్ కి ఎందుకు చెబుతున్నావేంటి. నాకు ప్రదీప్ తో కదా లింక్ ఉంది? అంటూ నోరు జారింది. దీంతో ప్రదీప్, పూర్ణ మద్య లింక్ ఉందని అందరికి తెలిసిపోయింది.