Poorna: పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకున్న పూర్ణ… సినిమాలకి దూరం కానుందా..?

Poorna: అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ పూర్ణ. ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూర్ణ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్ణ దృశ్యం 2, అఖండ, తలైవి వంటి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పూర్ణ ఇలా సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ 13 షో కి జడ్జ్ గా వ్యవహరించిన పూర్ణ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేస్తోంది. తాజాగా ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ లో పూర్ణ తను ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి బయటపెట్టి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన షానిద్‌ అసిఫ్‌ అలీతో పూర్ణ పెళ్ళికి సిద్ధమయ్యింది. ఇటీవల పూర్ణ తన పెళ్లి డేట్ గురించి బయట పెట్టింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. నవంబర్ లో తన పెళ్ళి జరగబోతోందని ఆమె వెల్లడించారు.నవంబర్ 6 న పూర్ణ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత పూర్ణ భర్తతో కలిసి దుబాయిలో ఉండబోతుందని ఈ సందర్భంలో చెప్పుకొచ్చింది.

దీంతో ప్రేక్షకులు తమ అభిమాన హీరోయిన్ ఇక సినిమాలకు దూరం కానుంది అంటూ తెగ బాధపడుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పూర్ణ ప్రేమ పెళ్లి చేసుకుంటుందని వస్తున్న వార్తల గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై పూర్ణ స్పందిస్తూ తనది పెద్దలకుదురుచిన వివాహమే అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఈ షో 75 వ ఎపిసోడ్ జరుపుకుంటున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పూర్ణ కూడా ఒక అద్భుతమైన పాటకు డాన్స్ చేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంది.