Poonam Kaur: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ కౌర్ చేసిన మరొక ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. అని మనస్ఫూర్తిగా ఆదరించి ప్రేమించిన వ్యక్తులు ఈ రాజకీయ నాయకుల దగ్గర వాళ్లకు వాళ్లే తక్కువ చేసుకొని చేతులు జోడించి, చేతులు కట్టుకుంటూ ఉండటం తనకు చాలా బాధ కలిగిస్తోందని ఆమె తెలిపింది. అవసరాల కోసం వ్యక్తిత్వం చంపేసుకోవడం మానేయాలి అంటూ ఆమె సూచించింది. ఈ ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసింది.
అనంతరం రాజకీయాలు ఎంటర్టైన్ మెంట్ గా మారాయని, ఎంటర్టైన్మెంట్ రాజకీయాలు గా మారుతున్నాయి అంటూ ఆమె మరొక ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతం అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పూనమ్ స్పందిస్తూ.. ఒక దర్శకుడు మూల నుండి నవ్వుతూ.. ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడతాడని, మరొక దర్శకుడు రాజకీయంగా ఆయనను కించపరుస్తూ ట్విట్టర్ లో నవ్వుతాడు అంటూ ఆమె విమర్శించింది.