Titanic and Radhe Shyam  : “టైటానిక్” కి “రాధే శ్యామ్” కి ఉన్న తేడా ఏంటో చెప్పేసిన పూజా హెగ్డే..!

Titanic and Radhe Shyam  : ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ రెడీగా ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో పడనుంది.
మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో అత్యంత క్రేజీ గా మారిన కొన్ని కీలక సన్నివేశాల్లో షిప్ సీక్వెన్స్ కూడా ఒకటి. ట్రైలర్స్ లో చూపించిన విజువల్స్ కే ఆడియెన్స్ ఓ రేంజ్ లో పిచ్చెక్కి పోతున్నారు. అయితే ఇలాంటి సీక్వెన్స్ చూసాక దీనిపై ప్రపంచ ప్రఖ్యాత సినిమా “టైటానిక్”  ముద్ర బాగా పడింది. దీనితో అక్కడ నుంచి రెండు సినిమాలకు పోలికలు కూడా మొదలయ్యాయి.
అయితే మరి అసలు రాధే శ్యామ్ కి టైటానిక్ కి ఏమన్నా సంబంధం ఉందా అనేది లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ పూజా హెగ్డే రివీల్ చేసేసింది. అలాంటి ఒక గ్రేట్ సినిమా తో మా రాధే శ్యామ్ ని పోల్చడం నిజంగా చాలా గర్వ కారణమే అని కానీ దీనికి దానికి సంబంధం ఉండదు. రాధే శ్యామ్ లో షిప్ సీక్వెన్స్ అనేది కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే.
ఇందులో కూడా షిప్ మునిగిపోతే అప్పుడు టైటానిక్ అనొచ్చు కానీ ఇది అలా ఉండదు అని కీలక సమాచారం ఈ క్రేజీ సీక్వెన్స్ పై ఈ డస్కీ బ్యూటీ చెప్పేసింది. సో టైటానిక్ కి రాధే శ్యామ్ కి ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ భారీ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ మార్చ్ 11 వరకు ఆగాల్సిందే.