Pooja Hegde And Prabhas : రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు విడుదల అయ్యిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరు ఫస్ట్ టైం జత కట్టారు.
అలాగే ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. అయితే ఫస్ట్ టైం ప్రభాస్ తో పూజా హెగ్డే నటించింది అంతా బాగానే ఉంది. పైగా ఈ సినిమా కి వచ్చిన స్పందనపై కూడా పూజా హెగ్డే పలు ఆసక్తికర కామెంట్స్ ని కూడా చేసింది. కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న మరో మాట బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.
ప్రభాస్ తో తనకి మళ్ళీ నటించాలని ఉందని ఒకవేళ నటించే అవకాశం వస్తే ఆ సినిమా ఏదో కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యిపోయింది ఈ డస్కీ బ్యూటీ. మరి ఆ సినిమా ఏదో కాదు బాహుబలి 2 కి సీక్వెల్ అట. అంటే “బాహుబలి 3” లో అయితే ప్రభాస్ తో నటించాలని ఉందని ఈమె లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో స్టేట్మెంట్ ఇచ్చింది.
మొత్తానికి అయితే పూజా హెగ్డే మాత్రం ఓ సరైన సినిమా మీదనే కన్నేసింది అని చెప్పాలి. మరి ఇది వరకే బాహుబలి 3 పై దర్శకుడు రాజమౌళి కూడా లైట్ గా ఆశలు చిగురించేలా చేసాడు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.