Pooja Hegde :పూజా హెగ్దే మనసులో మాట చెప్పేసింది. తన డ్రీమ్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Pooja Hegde : హీరోయిన్‌గా పూజా హెగ్దేకి తెలుగులో తిరుగే లేదు. ఆ మాటకొస్తే, అటు తమిళంలోనూ, హిందీలోనూ కూడా జోరు చూపిస్తోంది పూజా హెగ్దే. ఇటీవలే ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా అంచనాలను అందుకోకపోయినా, ఆ ఫెయిల్యూర్ ప్రబాస్ లిస్టులో చేరిపోయింది. కానీ, పూజాకి పెద్దగా ఫరఖ్ పడలేదనే చెప్పాలి.

తర్వాత, పూజా నుంచి ‘ఆచార్య’ సినిమా రాబోతోంది. రామ్ చరణ్‌కి జోడీగా పూజా హెగ్దే నటిస్తోంది ఈ సినిమాలో. ఇంతవరకూ ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపిన పూజా హెగ్దే ఇక ఇప్పుడు ‘ఆచార్య’ కోసం రంగంలోకి దూకింది. పాపం సినిమా హిట్ కాలేదు కానీ, ‘రాధేశ్యామ్’ కోసం పూజా చేసిన గ్లామర్ హంగామా అంతా ఇంతా కాదు.

ప్రమోషన్స్ కోసం కొన్ని రకాల థీమ్స్‌ని ఫాలో అవుతుంటుంది పూజా హెగ్దే. అలాగే, ‘ఆచార్య’ కోసం కూడా కొన్ని థీమ్స్ సెట్ చేసుకుందట. ఆ సంగతి అలా వుంటే, ఇప్పటికే స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూ, స్టార్ హీరోలతో జత కడుతున్న పూజాహెగ్దే తన మనసులోని కోరిక బయటపెట్టింది తాజాగా.

తనకు విశ్వనటుడు కమల్ హాసన్‌తో నటించడం ఓ డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఆ మాటకొస్తే, ఒక్కసారైనా కమల్‌హాసన్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు అందాల భామలు. అలాగే పూజా కూడా తన డ్రీమ్ హీరో కమల్ ‌హాసన్ అని చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్‌లో రణ్‌వీర్ కపూర్, తమిళంలో ధనుష్ సరసన నటించాలని వుందని చెప్పింది.

ధనుష్‌తో పూజా హెగ్దే జంట త్వరలోనే సెట్ అయ్యే ఛాన్సులున్నాయ్. ఎందుకంటే, ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా కోసం పూజా, విజయ్‌తో జత కట్టింది. ఇక నెక్స్‌ట్ ధనుష్‌ పక్కన ఛాన్స్ కొట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కమల్‌ హాసన్‌తో పూజాకి ఛాన్స్ రావడానికి మాత్రం ఇంకాస్త సమయం పడుతుందేమో. చూడాలి మరి.