Pooja Hegde : “రాధే శ్యామ్” బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పై పూజా హెగ్డే ఆసక్తికర కామెంట్స్.!

Pooja Hegde : ఈ ఏడాదికి ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” అనే చెప్పాలి భారీ అంచనాలు నడుమ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది కానీ అనూహ్యంగా ఓవరాల్ ఇండియా దగ్గర మాత్రం అనుకున్న స్థాయికి ఇది చేరుకోలేకపోయింది.
మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా మొదటి రోజే షాకింగ్ రెస్పాన్స్ మరియు రివ్యూస్ అందుకొని షాకిచ్చింది. దీనితో ఫైనల్ గా అయితే ఈ సినిమా నష్టాల్లోనే ముగిసిపోనుంది. అయితే ఈ సినిమా అందుకున్న స్పందనపై లేటెస్ట్ గా పూజా హెగ్డే బాలీవుడ్ వర్గాల్లో మాట్లాడినట్టు తెలుస్తుంది.
“ప్రతి సినిమాకి కూడా దాని డెస్టినీ ఉంటుంది దాని ప్రకారమే సినిమా ఫలితం వస్తుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే జస్ట్ ఓకే లా ఉంటాయి కానీ అవి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్స్ అయ్యిపోతాయి. అలాగే ఇంకొన్ని సినిమాలు విఫలం అవుతాయి కానీ అవి బాగుంటాయి” అని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
దీనితో తమ సినిమా బాక్సాఫీస్ పరంగా హిట్ అవ్వలేదని చెప్పకనే చెప్పేసింది అని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాకి దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించగా యూవీ క్రియేషన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం అందించారు.