అక్కినేని అఖిల్‌ని గట్టెక్కించిన పూజా హెగ్దే.?

Pooja Hegde Helps Akhil To Score Hit | Telugu Rajyam

కండలు తిరిగినోడు.. బోల్డంత బ్యాక్‌గ్రౌండ్ వున్నోడు.. డాన్సులేయగలడు, రిస్కీ స్టంట్లు చేయగలడు.. నటనలోనూ ఓకే. అన్నీ వున్నా.. పాపం అక్కినేని అఖిల్ ఇప్పటిదాకా హిట్టు కొట్టలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో వున్నాడు.. చాలా ఉత్సాహంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు.

‘లవ్ స్టోరీ’ హిట్ అవడంతో, మంచి జోరుమీదున్న అక్కినేని ఫ్యామిలీ.. అలాగే అక్కినేనా అభిమానులు.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద రెట్టించిన అంచనాలతో వున్నారు. ఆ అంచనాలు ఏమయ్యాయి.? అంటే, ఇంకేమవుతాయ్.. మేడమ్ పూజా హెగ్దే లక్కు కలిసొచ్చి, తొలి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయ్.!

అఖిల్ గట్టెక్కేసినట్లే.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. నో డౌట్, ఈ సినిమాకి పూజా హెగ్దే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. సినిమా రివ్యూల్లోనూ పూజా హెగ్దే వైపు పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అఖిల్ పెర్ఫామెన్స్‌కి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

ఓ మోస్తరు టాక్ వస్తే చాలు సూపర్ హిట్ చేసేద్దామని చూస్తున్న అఖిల్ అభిమానులకి.. అక్కినేని అభిమానులకి సరైన మేటర్ ఈ సినిమాతో దక్కిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles