కెరీర్ మొదట్లోనే ఫ్లాప్ చూసి బాలీవుడ్ వైపు పరుగులు తీసి అక్కడా నిరాశ ఎదురుకాగా చివరకు సౌత్ ఇండస్ట్రీ వైపుకే వచ్చి సెటిలైంది పూజా హెగ్డే. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆమెకు బాగా కలిసొచ్చింది. కలిసి రావడం అంటే అలా ఇలా కాదు ఏకంగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకునేలా కలిసొచ్చింది. దువ్వాడ జగన్నాథం సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఆమె ఆ తర్వత వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్లో ఏ పెద్ద హీరో సినిమా చేసినా వారి జాబితాలో పూజా తప్పకుండా ఉండాల్సిందే.
ప్రజెంట్ ఆమె చేతిలో ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’, చరణ్, చిరుల ‘ఆచార్య’ ఉండగా ఇప్పుడు అనేక మరొక భారీ ఆఫర్ తగిలింది. అదే తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో పూజా హెగ్డేను ఫైనల్ చేశారు టీమ్. పూజా కెరీర్ మొదలైందే తమిళ ఇండస్ట్రీలో. 2012లో వచ్చిన ‘ముగమూడి’తో ఆమె హీరోయిన్ అయింది. అదే ఆమె మొదటి సినిమా. కానీ ఆ చిత్రం ఫ్లాప్ అయింది. అప్పటి నుండి ఆమె అక్కడ సినిమానే చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఏకంగా విజయ్ సినిమానే తగిలింది ఆమెకు. మరి దీన్నే కదా లక్ అనేది.