పూజా హెగ్దే ఇంకోస్సారి: కుర్రహీరోతో రొమాన్స్

Pooja Hegde Again To Romance Young Hero | Telugu Rajyam

తన కన్నా వయసులో చిన్నహీరోయిన్స్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసేవారు ఎన్టీఆర్, ఏఎన్నార్ టైమ్ నాటి హీరోలు. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఇప్పుడు హీరోయిన్లే తమ కన్నా తక్కువ వయసున్న హీరోలతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సై అంటున్నారు.

ఈ మధ్య ఈ తరహా కాంబినేషన్లు చాలా సెట్ అయ్యాయి. హిట్ అయ్యాయి కూడా. రకుల్ ప్రీత్ సింగ్ తన కన్నా వయసులో చాలా చిన్నోడైన వైష్ణవ్ తేజ్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంది ‘కొండపొలం’ సినిమాలో. ఆ సినిమా హిట్ అయ్యింది. అలాగే, మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే చిన్న వయసు వాడైన అఖిల్‌తో జత కట్టింది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

అయితే, పూజా హెగ్దే ఇంతటితో ఆగేలా లేదు. మరో కుర్ర హీరోతో స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధపడుతోందట. ఆ హీరో ఎవరు.? ఏంటీ.? అనే వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, ఓ పెద్ద ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తున్న హీరో అని తెలుస్తోంది. చూడాలి మరి, ఆ హీరో ఎవరో. లక్కీ ఛామ్ పూజాతో జత కట్టి ఏ రేంజ్‌లో సంచలనాలు క్రియేట్ చేయనున్నాడో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles