నా సినీ కెరియర్ పై రాజకీయ ప్రభావం పడింది.. నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

Prakash Raj Sensational Post

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం తెలుగు భాషలలో కూడా ఎంతో మంచి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు.ఈయన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో వివిధ భాషలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కేవలం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా తన దృష్టిని సారించారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బిజెపి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఈయన చేస్తున్నటువంటి పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రకాష్ రాజ్ తన సినీ కెరియర్ గురించి పొలిటికల్ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కొందరు ఉద్దేశపూర్వకంగానే తన సినీ కెరియర్ ను టార్గెట్ చేస్తున్నారని తన సినీ కెరియర్ పై రాజకీయ ప్రభావం పడేలా చేస్తున్నారంటూ ఈయన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది నాతో నటించడానికి కూడా భయపడుతున్నారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

నా పక్కన కనుక నటిస్తే వారికి తిరిగి ఎక్కడ అవకాశాలు రావేమోనని తనతో నటించడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారని ఈయన ఆరోపించారు. ఈ విధంగా భయపడే వారందరినీ కోల్పోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.నా భయం మరొకరికి ఆయుధంగా కాకూడదు అందుకే ఎలాంటి పరిణామాలు అయినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ విషయంపై తాను ఏమాత్రం విచారణ చేయలేదని తను మునపటిలాగే సినిమాలపై దృష్టి సారిస్తున్నానని ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.