హైదరాబాద్ లో మోదీ.. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో భేటీ

pm modi visits bharat biotech company

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ కు మోదీ మధ్యాహ్నమే విచ్చేశారు. హకీంపేట విమానాశ్రయంలో దిగిన మోదీ.. వెంటనే భారత్ బయోటెక్ కు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలతో చర్చించారు.

pm modi visits bharat biotech company
pm modi visits bharat biotech company

భారత్ బయోటెక్ లో కరోనా వాక్సిన్.. కోవాగ్జిన్ పై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దాని గురించి భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు.

అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్ గా విమానంలో ప్రధాని హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీకి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. హకీంపేట నుంచి కారులో.. భారత్ బయోటెక్ కంపెనీకి ప్రధాని వెళ్లారు.