వచ్చేస్తున్నారు.. హైదరాబాద్ కు ప్రధాని మోదీ?

pm modi to visit hyderabad

ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపే చూస్తోంది. అది కూడా డిసెంబర్ 4 వరకే చూస్తుంది. తర్వాత ఎవరి పనులు వారివి. ఇప్పుడు హైదరాబాద్ వైపే చూడటానికి అసలు కారణం ఏంటో కూడా మీకు తెలుసు కదా. డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి కదా. అందుకే.. ఈ హడావుడి. హైదరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. ఢిల్లీ లీడర్లంతా హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతున్నారు.

pm modi to visit hyderabad
pm modi to visit hyderabad

ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ హైదరాబాద్ లో ప్రచారం చేశారు. ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలన్న కసితో బీజేపీ ఉంది. అందుకే.. బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తోంది.

అయితే.. ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ రానున్నారు. ఈనెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన వచ్చేది హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం కాదని.. శామీర్ పేటలో ఉన్న భారత్ బయోటెక్ ను మోదీ సందర్శించనున్నారంటూ చెబుతున్నారు.

భారత్ బయోటెక్ లో కరోనా వాక్సిన్ కొవాగ్జిన్ ట్రయల్స్ నడుస్తున్నాయి. దాని పురోగతిని మోదీ పరిశీలించనున్నారని సమాచారం. ఆ తర్వాత ప్రధాని అక్కడి నుంచి పూణె వెళ్తారట.

అయితే.. ఎప్పుడూ హైదరాబాద్ రాని మోదీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ కు వస్తుండటం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేక భారత్ బయోటెక్ ను సందర్శించి వెళ్లిపోతారా? అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

మరోవైపు ఈనెల 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, 28న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 29న కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. అయితే.. వీళ్లు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.