జగన్ కు మోడీ సర్కార్ గట్టి షాక్.. కళ్ళు బైర్లు కమ్మటమే తరువాయి

cm jagan modi

 తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లు ఉంది బీజేపీ వ్యవహార శైలి, ఒక వైపు సీఎం జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే, మరో వైపు కొన్ని కీలకమైన బిల్లులను వెనక్కి పంపుతుంది కేంద్రం, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ల్యాండ్ బిల్లు 2019 ను కేంద్రం ఆమోద ముద్ర వేయకుండా వెనక్కి పంపింది.

cm jagan modi

 ల్యాండ్ టైటిల్ బిల్లు -2019 లోని అంశాలు, క్లాజులు కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని, కేంద్ర రిజిస్ట్రేషన్‌ చట్టం-1908, కేంద్ర భూ సేకరణ చట్టం-2013లోని పలు నిబంధనలు, క్లాజులు అధిగమించేలా చట్టం ఉందని గుర్తించి పలుమార్లు వివరణ అడిగినా.. స్పష్టత రాకపోవడంతో వెనక్కి పంపింది. బిల్లు కేంద్రానికి వెళ్లాక పదహారు నెలలు పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందన్న నమ్మకంతోనే సమగ్ర భూముల రీసర్వే చేపట్టాలనుకుంది జగన్ సర్కార్.

 మొదటి నుండి కూడా జగన్ సర్కార్ తీసుకొస్తున్న అనేక బిల్లులు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనే మాటలు విన్పిస్తున్నాయి. మధ్యవర్తులు ఎవరైనా వాటిపై కోర్టుకు వాటిని కోర్టు పరిశీలించి వాటిని అక్కడే ఆపేయటం జరుగుతుంది. ఇలా ఇప్పటికే అనేక సందర్భాల్లో కోర్టు ఆ బిల్లులను ఆపేసింది. మరికొన్ని బిల్లులు మాత్రం నేరుగా కేంద్రం వద్దకు వెళ్తున్నాయి. గతంలో ఏపీ సర్కార్ గొప్పగా చెప్పుకున్న దిశా బిళ్ళను కూడా కేంద్రం వెనక్కి పంపింది.

 దీనిని బట్టి చూస్తే జగన్ సర్కార్ కు చట్టాల మీద సరైన అవగాహనా లేదేమో అనిపించకమానదు. అయితే కోర్టుల్లో ఆగిపోయే వాటిపై మాత్రం.. ప్రభుత్వ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి. న్యాయస్థానాలకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించి .. నేరుగా దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ.. కేంద్రం నియమ, నిబంధనలు ఏమిటో చెబుతూ వెనక్కి పంపే బిల్లులపై మాత్రం నోరెత్తడంలేదు.

  ఒక వేళా దిశా చట్టం కావచ్చు, ఇప్పుడు వెనక్కి వచ్చిన ల్యాండ్ టైటిల్ బిల్లు కావచ్చు కోర్టులో మాత్రం ఆగిపోయి ఉంటే వైసీపీ సర్కార్ ఎంత రాద్ధాంతం చేసేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామంటే కోర్టులు ఎందుకు అడ్డుకుంటున్నాయి..? భూసర్వే చేసి ఆక్రమణలను తొలిగించి అందరి భూములకు రక్షణ కల్పించాలని చూస్తే కోర్టులు ఎందుకు అడ్డుకుంటున్నాయి..? కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలే ఇలాంటి గొప్ప బిల్లులను అడ్డుకుంటున్నాయంటూ నానాయాగీ చేసేవాళ్ళేమో..!