SVSN Varma: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేయగా మరోవైపు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీలు మూడు కలిసి జగన్మోహన్ రెడ్డి పై పోటీకి దిగారు ఇలా ఈ మూడు పార్టీలు ఏకం కావడంతో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. కూటమి పార్టీలో అద్భుతమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు.
ఇక 2024 ఎన్నికలలో మాత్రం ఈయన చివరి నిమిషంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు అక్కడ అయితే తమ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇలా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కు ఈ నియోజకవర్గం నుంచి పోటీకి కన్ఫామ్ కావడంతో ఆ నియోజకవర్గంలో టిడిపి మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యతిరేకత చూపించారు.
ఇక చంద్రబాబు నాయుడు వర్మ కు నచ్చచెబుతూ తనకు ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు దీంతో వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతగానో కష్టపడి ఆయనని భారీ మెజారిటీతో గెలిపించారు అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో ఆధిపత్యం మొత్తం జనసేన చేతులలో ఉంది. తద్వారా వర్మకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. అలాగే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ పదవి కూడా ఇవ్వకపోవడంతో కాస్త భేదాభిప్రాయాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోని తాజాగా వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ మాత్రం సంచలనంగా మారింది. ఇందులో భాగంగా ఈయన ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతో కష్టపడుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించలేదు. ఇలా ఈ వీడియోని పోస్ట్ చేసిన వర్మ కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ఇలా ఈయన పెట్టిన పోస్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ ఏ మాత్రం కష్టపడలేదని ఆయన గెలుపు కోసం తానే కష్టపడ్డానని చెప్పకనే చెప్పేశారు..