Varma: నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా…. పవన్ పర్యటనలో వర్మ అసహనం… ఏం జరిగిందంటే?

Varma: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటన చేశారు. ఈ పిఠాపురం పర్యటనలో భాగంగా ఈయన రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా టిడిపి నేతలు కూడా పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం హాజరయ్యారు. ఇక ఈ పర్యటనలో భాగంగా వర్మ పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేవలం పవన్ కళ్యాణ్ ని కలవడానికి వర్మకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆయనతో పాటు వచ్చిన మరి కొంతమంది అనుచరులకు మాత్రం అనుమతి లేదని తెలియజేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం వర్మకు మాత్రమే అనుమతి లభించడం తన అనుచరులకు అనుమతి లభించకపోవడంతో వర్మ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.తన అనుచరులను కూడా పవన్ కల్యాణ్ వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని అన్నారు. లేదంటే వెళ్లిపోతానని హెచ్చరించారు. దీంతో ఎస్పీ బిందుమాదవ్ ఆయనకు నచ్చబెప్పి పవన్ కల్యాణ్ వద్దకు తీసుకువెళ్లారు.

నిజానికి పిఠాపురంలో వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈ నియోజకవర్గ టికెట్ పవన్ కళ్యాణ్ కు వెళ్లడంతో వర్మ రాజకీయాలకు దూరం కావలసి వచ్చింది. ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఇక ప్రస్తుతం తనకు ఎలాంటి పదవి లేకపోవడంతో కొంతమేర కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.