Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ.. పిఠాపురం సమస్యలు మీకు పట్టవా… అందరి నోట ఇదే మాట!

Pawan Kalyan: సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నిసార్లు పోటీ చేసిన ఓటమిపాలు అవుతూ వచ్చారు. అయితే ఇటీవల ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇలా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయడమే కాకుండా భారీ మెజారిటీతో గెలిచారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో పిఠాపురం పేరు భారీ స్థాయిలో మారు మోగిపోయింది.

ఇలా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. వేసవికాలం కావడంతో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి ఇలా గుప్పెడు నీటి కోసం మహిళలు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ అందరూ ఒకటే ప్రశ్న వేస్తున్నారు.

వేసవికాలంలో నీటి కొరత ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పిఠాపురంలో పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది కానీ ఇప్పటివరకు తాగునీటికి మాత్రం పరిష్కారం లభించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో భూగర్భ జలాలు మొత్తం అడుగంటి పోయాయి. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచినీరు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ వేడుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత 10 నెలల్లోనే కేంద్ర ప్రాజెక్టు అయిన జలజీవన్ మిషన్ మీద దృష్టి పెట్టారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని జలజీవన్ మిషన్ కేవలం మాటల వరకే ఉంది కానీ చేతలలో లేదు అంటూ పలువురు పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.