RRR: “రాజమౌళి”… తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నత స్థానంలో నిలిపాడు. రాజమౌళి గురించి ఆయన సినిమాల గురించి ఇతర బాషల వాళ్ళు గొప్పగా పొగుడుతుంటే… మనవాళ్ళు మాత్రం… అదేనండి… మన తెలుగు వాళ్ళు మాత్రం జక్కన్నపై ఆయన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మీద కేసులు పెడుతున్నారు. నిజంగా ఇది బాధాకరమైన విషయమే.
అల్లూరి సీతారామరాజు, కొమురం భీంలను కించపరిచే విధంగా ఉందని ఆర్ఆర్ఆర్ సినిమా ఉందని, తెలంగాణ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం పై ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు స్పందిస్తూ… కేసు వేసే ముందు చిత్రం చూడాల్సిందిగా కోరారు. ఆ మహనీయుల పేరుకి ఏమాత్రం భంగం కలగకుండా చిత్రం తీయడం జరిగిందని చెప్పుకొచ్చారు.
కాబట్టి, దయచేసి సినిమా విడుదలై, చూసేవరకు కేసును వాపస్ తీసుకోవాల్సిందిగా నిర్మాతలు కేసులు పెట్టిన వారిని కోరారు. ఇక ఈ సినిమా విడుదలై మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా సొంతం చేసుకుని మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.