దేశంలో పెట్రో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. వరుసగా 12వ రోజైన నేడు కూడా చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో లీటర్ పెట్రోలుపై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్ 40 పైసలు పెరిగి… లీటర్ రూ.94.18కి చేరగా… డీజిల్ ధర 40 పైసలు పెరిగి… లీటరుకు రూ.88.31 అయ్యింది. విజయవాడలో పెట్రోల్ లీటర్ 97.01 ఉండగా… డీజిల్ ధర లీటరు రూ.90.58 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర 39 పైసలు పెరిగి… లీటర్ రూ.90.58కి చేరింది. డీజిల్ కూడా 37 పైసలు పెరిగి లీటర్ రూ.80.97కి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 38 పైసలు పెరిగి… లీటర్ రూ.97కి చేరింది. డీజిల్ 39 పైసలు పెరిగి లీటర్ రూ.87.06కి చేరింది.
బెంగళూరులో 94.18, రూ. 88.31కి చేరుకున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ. 97.00గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.06గా ఉంది. పెరిగే ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నా… కేంద్రం పట్టించుకోవట్లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే ధరలను తగ్గించవచ్చు. పన్నులు తగ్గిస్తే… ధరలు తగ్గుతాయి. కానీ కేంద్రం అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కనిపించట్లేదు. డీజిల్ ధర పెంపుతో… నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ బండ ధరను ఆల్రెడీ పెంచారు. దీనితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.