AP: ఏపీలో మద్యం కుంభకోణం పై పెద్ద ఎత్తున విచారణలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ లో భాగంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు రావడంతో విచారణ కూడా శర వేగంగా జరుగుతుంది.ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
కృష్ణమోహన్ రెడ్డి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పని చేశారు. ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా ఈ కేసు పూర్తి స్థాయిలో మలుపు తిరగడమే కాకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా చిక్కుల్లో పడేస్తుందని తెలుస్తుంది.. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32గా ఉన్నారు. ఇలా ఇద్దరు అరెస్టు కావడంతో మాజీ మంత్రి పేరుని నాని తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ…ఇది రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్‌లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనం అని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరో ఒకరిని అరెస్టు చేసి వారి నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకొని మరొకరిని అరెస్టు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని పేర్ని నాని తెలిపారు .
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా దాదాపు 370 కోట్లు అవినీతి జరిగిందని పక్క ఆధారాలతో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు. చంద్రబాబు దాదాపు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు అయితే తనకంటే ఒకరోజు అదనంగా అయిన జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని పేర్ని నాని ఆరోపణలు చేశారు.ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ జగన్‌ను భయపెట్టాలని అనుకోవడం వారి అవివేకమని పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.