Kranthi Balivada: ఒక నటికి గ్లామర్‌తో పాటు, నటన అనేది చాలా ముఖ్యమని ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ అన్నారు. కేవలం గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదని ఆమె చెప్పారు. ఒక క్యారెక్టర్‌ను స్ర్కీన్‌పై కొన్ని గంటల పాటు చూడాలంటే అందం ఉండాలి. కానీ అలా కేవలం అందం మాత్రమే ఎంత సేపు చూస్తాము అని ఆమె ప్రశ్నించారు. ఓన్లీ గ్లామర్ మాత్రమే కావాలనుకుంటే గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా డిజిటల్ మీడియాలో ఎక్కడైనా దొరుకుతుంది కదా అని ఆమె అన్నారు.
కొంతమందినైతే ఎక్కడి నుంచో తీసుకొని వస్తారు. అందంగానే ఉంటారు. కానీ వాళ్లకు అసలు డైలాగ్ చెప్పడమే రాదని బలివాడ చెప్పారు. అలాంటి సంఘటనలు తాను చాలా ఫేస్ చేశానని ఆమె తెలిపారు.
కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాల్లో కేవలం అందంగా ఉన్నారని సెలక్ట్ చేస్తారని, కానీ వారికి నటన గానీ, డైలాగ్ చెప్పడం గానీ రాదని ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ అన్నారు. ఎన్ని టేక్‌లు తీసుకున్నా వారు మాత్రం డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారని ఆమె చెప్పారు. దాన్ని చూసి తమనే ఆ డైలాగ్ చెప్పమనేవారని ఆమె తెలిపారు. అలా వారికి డైలాగ్ చెప్పడం రాక, డైరెక్టర్స్ వారితో ఏబీసీడీలు కూడా చెప్పించేవారని, అలాంటి వాళ్లకు తాము డబ్బింగ్ చెప్పామని ఆమె అన్నారు. అది అప్పటికి బాగానే ఉంటుంది గానీ, స్ర్కీన్‌పై చూసినపుడు అది సింక్ అవదని, అది వాళ్ల కర్మ అని ఆమె స్పష్టం చేశారు. తమకు ఇచ్చిన పనేంటి డబ్బింగ్ చెప్పడం, ఆ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడం అంతేనని, అందుకని తమ పని తాము చేస్తామని బలివాడ వివరించారు.