తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొందరు వ్యక్తులు బాలికను జుట్టు పట్టుకొని కొడుతూ, రెండు కాళ్లు పైకి పెట్టి అరి కాళ్లకు కట్ల తో దారుణంగా కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని అమేథి పరిధిలో ఒక యువతి తమ ఇంట్లో దొంగతనం చేసింది అనే ఆరోపణలతో కొందరు వ్యక్తులు ఆ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని లాక్కుని ఇంట్లోకి వచ్చి బంధించి, అనంతరం ఆమెను నేలపై తోసి ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
పాపం ఆ యువతీ దెబ్బలు తాళలేక నొప్పి అని అల్లాడుతున్నప్పటికీ, పక్కనే ఉన్న మహిళలు కూడా అడ్డు రాకపోగా ఆ బాలికను తీవ్రంగా దూషిస్తూ, బాలికను కొడుతుంటే అక్కడున్నవారంతా వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అమేథి పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ఆ బాలికను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యూపి లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021
ఈ ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. యోగి వేమన ప్రభుత్వం నిద్రపోతుంది అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్కృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరిని మాత్రమే అరెస్టు చేశామని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అమేథి పోలీసు అధికారి అర్పిత్ కుమార్.