Crime News: విలువైన వస్తువులు దొరికే చోట అక్రమ త్రవ్వకాలు, రవాణాలు జరుగుతూ ఉంటాయి. కొన్నికొన్ని సందర్భాలలో అక్రమ రవాణా చేసే అక్రమార్కులను పట్టుకోవడం కష్టం. కాని కొన్ని సమయాల్లో వెంటనే దొరికిపోతుంటారు. అలా తాజాగా అక్రమ తవ్వకాలు చేస్తున్న అక్రమార్కులను పట్టుకున్నారు ఓ గ్రామస్తులు.
నెల్లూరు జిల్లాలో తెల్లరాయి తవ్వకాలు అక్రమంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆ అక్రమార్కులను పట్టుకోవడానికి వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామస్తులు ముందుకు వచ్చి వాళ్లను పట్టుకున్నారు. రవాణా చేస్తున్న టిప్పర్ ను, అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ప్రొక్లెయిన్ ను కూడా ధ్వంసం చేశారు. ఇక ఇద్దరి డ్రైవర్లను ఆ గ్రామస్తులు అదుపులోకి తీసుకొని అక్కడి పోలీసులకు వారిని అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు వారిపై విచారణ చేపడుతున్నారు.