Summer Effects: ఎండాకాలం వస్తే చాలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్నో ప్రాణాలు సతమతమవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. దాదాపు 40 డిగ్రీలు దాటి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అదిలాబాద్ జిల్లాలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయి అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలలో పలువురు వడదెబ్బకు గురై మరణించిన సంగతి తెలిసిందే.