కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మధ్య నలిగిపోతున్న ప్రజలు..

గత కొంత కాలం నుంచి కేంద్ర, రాష్ట్రాలలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతుంది. ఈ విషయంలో ధర్నాలు చేపట్టిన కూడా ప్రభుత్వం సహకరించడం లేదు.

కానీ ఇటీవలే పెట్రోల్ ధర రూ.8 తగ్గించారు. నిజానికి గతంలో పెట్రోల్ ధర రూ.60 ఉంటే దానిని రూ.120 చేశారు. ఇక సిలిండర్ ధర రూ.550 ఉంటే దానిని ఒక రూ.1050 చేసి దాంట్లో రూ. 200 తగ్గించారు. ఇక నూనె ధర రూ.85 ఉంటే రూ.220 కి పెంచారు. ఇక దీంట్లో రూ.20 తగ్గించారు. నిజానికి ధరలు పెంచి అందులో కొంత మేరకు తగ్గించటంతో ఎటువంటి లాభం లేదని ప్రజలకు తెలిసిపోయింది. దీంతో ఈ విషయంలో ప్రజలు బాగా నలిగిపోతున్నారు.