Sreeleea: పెళ్లిసందడి హీరోయిన్ శ్రీ లీల పోస్ట్ వైరల్..?

Sreeleea: పెళ్లి సందడి సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ శ్రీ లీల. టాలీవుడ్ సిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి తెరకెక్కించిన సినిమాతో శ్రీ లీల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె అందం అభినయం కు యూత్ ఫిదా అయిపోయారు.ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ ను సంపాదించుకుంది శ్రీ లీల.

 

ఇదిలా ఉంటే తాజాగా శ్రీ లీల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. మనసు చంచలమైనది.. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం వల్ల మనసు నియంత్రించుకోవచ్చు అని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం హాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.