Peddi Reddy: పవన్ కళ్యాణ్ నన్నేం పీకలేరు…. సవాల్ విసిరిన పెద్దిరెడ్డి…. ప్రభుత్వానిదే ఆలస్యం?

Peddi Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులను టార్గెట్ చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే గత కొంతకాలంగా వైకాపా కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమినేతలకు టార్గెట్గా నిలిచారు. ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డి పై కూడా ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా అతనిపై దాడి కూడా చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలువురు వైకాపా నాయకులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి కూడా అటవీ భూములను ఆక్రమించారు అంటూ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని మంత్రి తెలియజేశారు.

గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారని వారి పై 50 కోట్లకి పరువు నష్టం దావా వేశామన్నారు. ఈరోజు కూడా మేము అటవీ భూములను ఆక్రమించాము అంటూ తప్పుడు రాతలు రాసారని ఈయన మండిపడ్డారు. 2001 లో మేము ఆ ప్రాంతం లో భూములు కొనుగోలు చేశామన్నారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారని మండిపడ్డారు.

ఇదే భూమి గురించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆరోజు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదు అని తేల్చి చెప్పిందన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారన్నారు. కోర్టులో పిటిషన్ వేసిన కూడా కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చిందని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానా అంటే వెనుక ముందు ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ కూడా తందాన అంటారు అంటూ విమర్శలు కురిపించారు. ఇసుక ద్వారా 40 కోట్లు మింగేసానని నేపాల్ లో ఎక్కడో ఎర్రచందనం దొరికితే అది నాదేనని ఎన్నో విమర్శలు చేశారు ఇవన్నీ కూడా నేనే చేసినట్లు రుజువు అయితే మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మరి ఈయన గురించి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలలో నిజానిజాలను బయటపెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంది కదా మరి ఎందుకు అలసత్వం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.