పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు సినిమాకు పరిచయమైన మొదటి సినిమాతోనే ఇంతలా క్రేజ్ దక్కించుకోవడం పాయల్ రాజ్‌పుత్‌కే దక్కింది. ఇందు పాత్రలో పాయల్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
ఇప్పటికీ పాయల్ చేసిన రచ్చను ఎవ్వరూ మరిచిపోలేక పోతున్నారు. అయితే పాయల్ మాత్రం మరోసారి ఆ రేంజ్ కథలో నటించలేదు. అలాంటి పాత్రతో మరోసారి మెస్మరైజ్ చేయలేకపోయింది. చివరకు అనగనగా ఓ అతిథి సినిమాలో మాత్రం పాయల్ తన విశ్వరూపాన్ని చూపించింది. అద్భుతంగా నటించి సినిమా సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది. అలా పాయల్ సినీ కెరీర్ కొనసాగుతూ ఉంది.
పాయల్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చిన్న పిల్లలా చేసే చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ మధ్య కరోనా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే గట్టిగా అరవడం, భయపడటంతో ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. వాటిపై దారుణమైన ట్రోలింగ్ కూడా జరిగింది. తాను అంతలా భయపడుతూ ఉంటే ఇంతలా ట్రోల్ చేస్తారా? అని పాయల్ ఫైర్ అయింది. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసే పాయల్ తాజాగా ముద్దుల వర్షాన్ని కురిపించింది. కిస్ అంటూ స్వీట్‌గా గాల్లో ముద్దులను విసిరింది. దీంతో అభిమానులు దెబ్బకు పడిపోతున్నారు.