దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా అంటూ పాడుకోవడమే ఇక. పండుగ సీజన్ ప్రారంభం అయింది. దీంతో పలు కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీలు కూడా భారీగా ఆఫర్లు ప్రకటించాయి.
ఈ సమయంలో బైక్ కొనాలనుకునే వారికి మాత్రం బంపర్ ఆఫర్లు లభించనున్నాయి. హీరో, హోండా, టీవీఎస్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. కేవలం రూపాయి కడితే చాలు.. ఏ బైక్ అయినా సరే సొంతం చేసుకోవచ్చు. రూపాయి చెల్లించండి.. మీకు నచ్చిన బైక్ ను ఇంటికి తీసుకుపోండి.. అంటూ ఆటోమొబైల్ కంపెనీలను వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దానితో పాటు పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించాయి.
ముందు రూపాయి కట్టండి.. తర్వాత నెలనెలా ఈఎంఐలు కట్టండి. ఈఎంఐల కోసం.. బ్యాంక్ లోన్ కోసం బ్యాంక్ కు వెళ్లాల్సిన అవసరమే లేదు. మీదగ్గర డెబిట్ కార్డు ఉన్నా చాలు.. దాని ద్వారానే ప్రతి నెలా ఈఎంఐ కట్ అవుతుంది.
కస్టమర్లు ఈఎంఐ కోసం 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలను ఎంచుకోవచ్చు. ప్రీ పేమెంట్ ఆప్షన్ మాత్రం దీంట్లో అవేలబుల్ లేదు. ఇక.. హోండా కస్టమర్లకు అదనంగా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం.. బైక్ కొనాలనుకునే వాళ్లు దసరాకు ముందే బైక్ షోరూంకు వెళ్లి కేవలం రూపాయి చెల్లించి నచ్చిన బైక్ ను సొంతం చేసుకోండి. సొంత బైక్ కలను నెరవేర్చుకోండి.