Pawan Kalyan: రప్పా రప్పా అంటే భయపడతామా.. నన్నేం పీ*లేరు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హర హర వీరమల్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు అయితే మీడియా సమావేశాలలో భాగంగా కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఈ తరుణంలోనే గత ప్రభుత్వ పాలన గురించి, నాయకుల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ నాయకులు మాట్లాడితే రప్పా రప్పా అంటున్నారు.. వారి తాటాకు చప్పులకు ఎవరు భయపడరని పవన్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లు రప్పా రప్పా అంటూ ఉంటే చూస్తూ కూర్చుంటామా? తాము ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో కృషి చేసే ప్రజలలో నమ్మకాన్ని సంపాదించుకొని ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు.

ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి కూడా ఈ సందర్భంగా పవన్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మద్యపానం నిషేధం చేయడమే కాకుండా ధరలు పెంచి చీప్ లిక్కర్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు.

డబ్బు పోతే పరవాలేదు కానీ ప్రాణాలు పోతే ఎలా? ప్రాణాలతోనే చెలగాటమా? అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో భాగంగా పలువురు అరెస్ట్ కావడం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తప్పు చేసి ఉంటేనే అరెస్టు చేస్తున్నామే తప్ప అక్రమంగా ఎవరిని అరెస్టులు చేయలేదని చట్ట ప్రకారం న్యాయబద్ధంగా కేసు విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.