దర్శకుడు పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేసినా ఒక సెన్సేషనే. ప్రతి హీరోకి ఒక ట్రేడ్ మార్క్ పడేలా ఉంటాయి పూరి సినిమాలు. అందునా బడా హీరోలతో ఆయన వర్క్ ఇంకా క్రేజీగా ఉంటుంది. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా అంటే హైప్ వేరే లెవల్. గతంలో ఈ ఇద్దరూ కలిసి బద్రి, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు చేశారు. వీటిలో బద్రి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అందులోనే పవన్ తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ మీద అభిమానులకి తెగని ఆసక్తి. మరోసారి ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే చూడాలని అనుకుంటున్నారు.
మరి వారి కోరిక తీరుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో చెప్పుకున్నట్టు వీరిద్దరూ కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నారట. పవన్ రీఎంట్రీని చాలా వేగంగా ప్లాన్ చేసుకున్నారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని తాపత్రయ పడుతున్నారు. అందుకే మంచిది అనదగిన ఏ స్టోరీని పక్కకు పోనియ్యట్లేదు. వరుసగా సినిమాలకి సైన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక రీమేక్ సినిమా చేస్తున్న పవన్ దాని తర్వాత హరీష్ శంకర్ సినిమా చేయనున్నారు. దీని తర్వాత పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ ఉండవచ్చని సమాచారం. ఇప్పటికే స్టోరీ లాక్ అయిందని కూడ అంటున్నారు. మరి వీరి సినిమా ఎప్పుడు అధికారికంగా అనౌన్స్ అవుతుందో చూడాలి.