ఆదివాసీల పాట‌కు ప‌ర‌వ‌శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియోని ట్విట్ట‌ర్‌లో చేయ‌డంతో వైర‌ల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం టాప్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న‌కు అభిమానుల‌లో ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ చాలా సింపుల్‌గా ఉంటారు. ప్ర‌కృతి న‌డుమ ఎక్కువ‌గా జీవిస్తూ ప్ర‌జ‌ల‌కు ఎలా సేవ‌లు చేయాల‌నే దానిపై ఆలోచ‌న‌లు చేస్తుంటారు. రాజ‌కీయాలలోకి వ‌చ్చాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల బాగోగుల‌పై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నాడు. రెండేళ్ళ త‌ర్వాత సినిమాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ చిత్రం తెర‌కెక్కుతుండగా, ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుదల కానుంది.

వ‌కీల్ సాబ్ చిత్ర షూటింగ్‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల అర‌కు వెళ్లారు. అక్క‌డ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌లోఓ పాల్గొంటున్నారు. అయితే బ్రేక్ స‌మ‌యంలో ఆయ‌న ఆదివాసీల‌తో కాసేపు స‌ర‌దాగా గ‌డ‌పాడు. ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాట రూపంలో వారి స్థితిగతుల్ని వపన్‌కు వివరించారు.
ఈ వీడియోని స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘ వనవాసి’ గుర్తుకువచ్చింది)’అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, ఆదివాసీలతో అంత ఆప్యాయంగా ఆయ‌న మాట్లాడ‌డంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప‌వ‌న్ గ‌తంలో కూడా ప‌లు ఊర్ల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి వారితో ప్రేమ‌గా మాట్లాడ‌డం, వారి ప‌రిస్థితులని తెలుసుకోవ‌డం వంటివి చేసిన సంగ‌తి తెలిసిందే.