పవన్ తొడపాయసం పెట్టేశాడా.. సోము దార్లోకి వచ్చినట్టేనా ?

Pawan mark treatement to BJP
జనసేన, బీజేపీ పొత్తు మొదటి నుండి అవకతవకగానే ఉంది.  ప్రతి విషయంలోనూ  రెండు పార్టీలు సొంత నిర్ణయాలతో ముందుకెళుతున్నాయి తప్ప ఉమ్మడి నిర్ణయమనేదే లేదు.  మొదట్లో జనసేనతో స్నేహం చేయడం అదృష్టమన్నట్టు కలరింగ్ ఇచ్చిన నిమ్మగడ్డ మెల్లగా బీజేపీ పైత్యాన్ని ప్రదర్శించారు.  రాష్ట్రంలో  అన్నింటికంటే అట్టడుగు పార్టీ అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నది తామే కదా అనుకున్నారో ఏమో కానీ జనసేనను తొక్కిపెట్టాలని చూశారు.  సయోధ్య సంగతి పక్కనబెడితే ప్రతి విషయంలోనూ రగడే.  తిరుపతి ఉపఎన్నికల అభ్యర్థి విషయంలో ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది.  ఏ పార్టీ వ్యక్తి ఎన్నికల్లో నిలబడతారనేది క్లారిటీ లేదు.  ఒక దశలో సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారని చెప్పడం జనసేన శ్రేణులకు కాదు పవన్ కు కూడ నచ్చలేదు.  
 
Pawan mark treatement to BJP
Pawan mark treatement to BJP
నేరుగా ఢిల్లీ వెళ్ళి పంచాయతీ పెట్టుకున్నారు.  స్నేహం చేస్తే ఇదేనా ఇచ్చే విలువ అంటూ కాస్త గట్టిగానే మాట్లాడినట్టు ఉన్నారు.  ఆ తర్వాత నుండి సోము వీర్రాజు నోటి వెంట బీజేపీ అభ్యర్థి ఖాయమనే మాట రాలేదు.  ఇక దేవాలయాల మీద దాడుల విషయంలో రెండు పార్టీల దృష్టి కోణం భిన్నంగానే ఉంది.  ఉన్నపళంగా నిందను వైసీపీ మీదకు, జగన్ మీదకు నెట్టేసి పెద్ద అగ్గిని రాజేయాలని బీజేపీ ప్రయత్నించగా పవన్ మాత్రం మౌనంగానే ఉండి ఎప్పుడో కానీ స్పందించలేదు.  ఆ విషయాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశ్యం కూడ ఆయనకు లేదు.  అలాగేనా బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో కూడ లేరు ఆయన.  ఈ సంగతి బీజేపీకి చాలా త్వరగానే తెలిసొచ్చింది. 
 
ఇక ఈమధ్య సోము వీర్రాజు వేసిన మరొక బాంబు బీసీ ముఖ్యమంత్రి.  తాము  గెలిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని, అదే బీసీ నేతను సీఎం పదవిలో కూర్చోబెట్టే  దమ్ము వైసీపీ, టీడీపీలకు ఉన్నాయా అని అన్నారు.  దీంతో జనసేన  ఘొల్లుమంది.  గెలిచేది లేనిది పక్కనబెడితే జనసేనకు  ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే పవనే.  పవన్ కూడ సీమే అవ్వాలనే ఆశతోనే ఉన్నారు.  పొత్తు పెట్టుకున్నా కూడ కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అని మొదటి నుండి అంటున్నాయి  జనసేన వర్గాలు.  మొదట్లో సోము వీర్రాజు కూడ అదే అన్నారు.  ఎందుకంటే పవన్ కంటే ప్రజాదరణ కలిగిన వ్యక్తి లేరక్కడ.  కానీ వీర్రాజు మాత్రం బీసీ ముఖ్యమంత్రి అనడం ఆందోళనకు గురిచేసింది.  పవన్ కూడ దీన్ని సీరియస్ గానే తీసుకున్నట్టు ఉన్నారు.  
 
అందుకే కేంద్రం పెద్దలతో గట్టిగానే ఇంటరాక్ట్ అయినట్టున్నారు.  వెంటనే సోము మాటల్లో తేడా కనిపించేసింది.  సీఎం అభ్యర్థి అనేది నా నిర్ణయం కాదు అది కేంద్రం పెద్దలు తీసుకునే నిర్ణయం.  జేపీ నడ్డా లాంటి పెద్దలు నిర్ణయిస్తారు అంటూ మాట్లాడారు.  అంటే ఎప్పటికప్పుడు పవన్ పెడుతున్న తొడపాయసాలు బీజేపీ మీద గట్టిగానే పనిచేస్తున్నాయని అర్థమవుతోంది. 
 
Pawan mark treatement to BJP
 
Keywords: Pawan Kalyan, BJP, Somu Veerraju, Janasena, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు, జేపీ నడ్డా