Pawan Kalyan: సనాతనధర్మ టూర్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ …. ముహూర్తం పిక్స్?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన తన బాధ్యతల కంటే కూడా సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో సనాతన ధర్మాన్ని కాపాడటం కోసమే ఈయన దీక్షలు కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ టూర్ ప్లాన్ చేశారని తెలుస్తోది.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ఆధ్యాత్మిక ఆలయాలను సందర్శించబోతున్నారని తెలుస్తోంది. ఈ సనాతన ధర్మ టూర్ ప్రారంభానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ వివిధ ఆలయాలను సందర్శించనున్నారు.

అనంతపద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరుసరామస్వామి ఆలయం, అగస్థ్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈయన సనాతన ధర్మం టూర్ లో భాగంగా తమిళనాడులోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలలో కూడా పలు చర్చలకు కారణమవుతుంది.

ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ నేరుగా తమిళనాడులో పర్యటిస్తూ సనాతన ధర్మం గురించి ఎంతో బలంగా తన వాదనను వినిపించబోతున్నారని స్పష్టమవుతుంది దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం టూర్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

పవన్ కల్యాణ్ పర్యటన వల్ల సనాతన ధర్మ పరిరక్షణపై ప్రజల్లో చర్చ జరుగుతుందని, అది రాజకీయంగా కొత్త మార్గాన్ని తెరిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు అయితే మరికొందరు మాత్రం పవన్ వ్యవహార శైలిని కూడా తప్పుపడుతున్నారు.