Pawan Kalyan’s : ‘వకీల్ సాబ్’ సినిమాకీ, ‘భీమ్లానాయక్’ సినిమాకీ మధ్య గ్యాప్ కోవిడ్ కారణంగా వచ్చింది. లేదంటే, ఈ గ్యాప్ చాలా తక్కువగా వుండేదేమో.! ఇంతకీ, తదుపరి సినిమాల పరిస్థితేంటి.? ఇంకో ఆర్నెళ్ళలో పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం దాదాపుగా లేదు.
ఎలా చూసుకున్నా, వచ్చే సంక్రాంతికే పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా వుండొచ్చు. అది ‘హరిహర వీరమల్లు’ అవుతుందా.? లేదంటే, ‘భవదీయుడు భగత్ సింగ్’ అవుతుందా.? లేదంటే, ఇంకోటేదైనా కొత్త ప్రాజెక్టు వచ్చి చేరుతుందా.? అన్నదానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం.
అసలు ఈ చర్చ ఇప్పుడెందుకు జరుగుతోందంటే, వున్నపళంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల్ని సవరించింది. ఇది కొంతమేర సినీ పరిశ్రమకి ఊరటే.
‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపిన వైనం అందరికీ తెలిసిందే. ‘భీమ్లానాయక్’ మాత్రమే కాదు, ‘వకీల్ సాబ్’ కూడా జగన్ సర్కారు ఆగ్రహానికి గురైంది. ఆ ఆగ్రహమే లేకపోతే, ‘భీమ్లానాయక్’ ఇంకా పెద్ద విజయం సాధించి వుండేదే.
ఈ నేపథ్యంలోనే పవన్ కొత్త సినిమా ఇప్పటికిప్పుడు విడుదలైతే జగన్ సర్కారు ఏం చేస్తుంది.? అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ, ఆ అవకాశమైతే లేదు. ‘రూల్స్ ఏ సినిమాకి అయినా ఒకటే..’ అని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా, ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’ తదితర చిత్రాలకు లేని ఆంక్షలు ‘శ్యామ్ సింగరాయ్’, ‘బీమ్లానాయక్’ సినిమాలకు మాత్రమే ఎందుకొచ్చాయ్.?