Pawan Kalyan: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి పార్టీలు విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే కూటమిలో విభేదాలు వచ్చాయని తద్వారా కూటమి పార్టీ చీలికలు అవుతుంది అంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి. అయితే కూటమి పార్టీ కలిసి ఉండటం విడిపోవడం గురించి ఈ విధంగా వస్తున్నటువంటి వార్తలపై కూటమినేతలు ఎవరు కూడా స్పందించలేదు కానీ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ఈ వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నన్ను కొట్టిన తిట్టిన ఆంధ్రప్రదేశ్లో కూటమి మరో 15 సంవత్సరాలు పాటు అధికారంలోనే ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సభలో గవర్నర్ కి మర్యాద ఇవ్వకుండా వ్యవహరించిన పార్టీ శాసనసభలోకి రాకూడదు అధికారంలోకి కూడా రాకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే మేము కలిసి ఉంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము కలిసి ఉంటూ కలిసి పోరాటం చేస్తాము ఒకటి కాదు రెండు కాదు 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుందని పవన్ తెలిపారు. ఇందులో నాకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నో తిట్లు భరించాను. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను పోరాడుతూనే ఉంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ విధంగా కూటమిలో చీలికలు ఏర్పడ్డాయి అంటూ వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడినట్టు అయింది. ఇక చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు కానీ చంద్రబాబు నాయుడు పార్టీతో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్లే 2024 ఎన్నికలలో అధికారంలోకి వచ్చారని ఇలా పొత్తు లేకపోతే జగన్ ను ఢీకొట్టడం అంటే కాస్త కష్టమైన పని అని చెప్పాలి అందుకే తాము అసలు విడిపోము అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు.