Pawan Kalyan: హరిహర వీరుమల్లు కోసం పవన్ తీసుకుంది ఇంతేనా… మరీ అంత తక్కువనా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే ఈయన అనూహ్యంగా రాజకీయాల వైపు వచ్చారు. ఇలా రాజకీయాలలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రమక్రమంగా దూరమవుతూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకరోజు సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెడితే రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో తెలిపారు. తాను ఒకరోజు షూటింగ్ కి వెళ్తే రెండు కోట్లు వస్తాయని డబ్బు కోసం తాను రాజకీయాలలోకి రాలేదు ప్రజాసేవకే చేయటానికే రాజకీయాలలోకి వచ్చాను అంటూ గతంలో ఈయన తీసుకొనే రెమ్యూనరేషన్ గురించి తెలిపారు.ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో తెలిపారు. తాను ఒకరోజు షూటింగ్ కి వెళ్తే రెండు కోట్లు వస్తాయని డబ్బు కోసం తాను రాజకీయాలలోకి రాలేదు ప్రజాసేవకే రాజకీయాలలోకి వచ్చాను అంటూ గతంలో ఈయన రెమ్యూనరేషన్ గురించి తెలిపారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు సంచలనంగా మారాయి.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది. ఈయన చివరిగా నటించిన బ్రో సినిమా కోసం 50 కోట్లు తీసుకున్న వీరమల్లు సినిమా కోసం మాత్రం 15 కోట్లు తీసుకున్నారని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా గత కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమైంది ఈ సినిమా పూర్తి అయ్యే సమయంలో నిర్మాత ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నారని ఆయన ఇబ్బందులు చూసిన పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ పూర్తిగా తగ్గించుకున్నారని తెలుస్తుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.