Pawan Kalyan: సరిగ్గా గతేడాది జూన్ 4వ తేదీ వైసీపీ ఘోర పరాజయం పాలవటమే కాకుండా కూటమి ప్రభుత్వం మాత్రం భారీ మెజారిటీని సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది. సరిగ్గా జూన్తే 4 వ తేదీకి కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంతవరకు పెరిగింది? ఈయన పాలనపై ప్రజల స్పందన ఏంటి అనేదాని గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా కొన్ని శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన శాఖలకు పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తున్నారని చెప్పాలి అదే విధంగా గిరిజన ప్రాంతాలలో ఉండే ప్రజలకు రోడ్లు,మంచినీటి సమస్యలను ప్రధానంగా తొలగించేందుకు ఒకింత పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. పంచాయతీలకు నిధులు విడుదల చేయించడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారు.
ఈయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పంచాయతీరాజ్ అటవీశాఖకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రజల కష్టాలను కూడా తీరుస్తూ సక్సెస్ అందుకున్నారు కానీ ఒక విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తున్నాయి. పవన్ అధికారంలో లేనప్పుడు పెద్ద ఎత్తున అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రజలకు సమస్యలుగా తలెత్తాయి అయితే ఈ నిర్ణయాలపై పవన్ మౌనంగా ఉండటమే సమస్యగా మారింది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు తనకు తాను ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ ప్రశ్నల గురించి మానేశారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాలకు తలూపటమే ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది.
ఇలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు కాదు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కేబినెట్లో ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా తల ఊపటమే ఇప్పుడు సమస్యగా మారిందని, ప్రజా సంక్షేమమే ముఖ్యమని పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమం కోసం నోరు విప్పితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.