Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనబడగానే ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. తర్వాత పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఒక వ్యక్తిగత వైద్యుడు, అపోలో వైద్య బృందం నిరంతరం ఆయన్ను పర్యవేక్షిస్తూ వచ్చారు.
పవన్ వారం రోజుల్లోనే చాలా వరకు కొలుకున్నారు. ప్రజెంట్ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారు. అయినా ముందు జాగ్రత్తగా ఇంకొన్ని రోజులు క్వారంటైన్లోనే ఉంటున్నారు పవన్. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు ఆయన.
బయట పరిస్థితులు చక్కబడ్డాక ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొంటారట. అంటే ఇంకో నెల రోజులు పవన్ సినిమాలేవీ రీస్టార్ట్ అయ్యేలా కనబడట్లేదు. ప్రస్తుతం పవన్ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ రీమేక్, క్రిష్ డైరెక్షన్లో ‘హరి హర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. అవి రెండూ కమోలీట్ అవ్వగానే హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంది.
అసలే పవన్ ఈ ఏడాది ఇంకొక సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. చూడబోతే అది వర్కవుట్ అయ్యేలా లేదు. సెకండ్ వేవ్ త్వరగా తగ్గి పవన్ బయటికొస్తేనే సెట్స్ మీద ఉన్న సినిమాలు కంప్లీట్ అవ్వడం, కొత్త సినిమాలు మొదలవ్వడం జరుగుతుంది.