Home News ప‌వ‌న్ సినిమాల‌లో యాదృచ్చిక అంశాలు.. ఆనందంలో అభిమానులు

ప‌వ‌న్ సినిమాల‌లో యాదృచ్చిక అంశాలు.. ఆనందంలో అభిమానులు

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న డిమాండ్.. రేంజ్ వేరు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ హీరోగా వరుసగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ప్రజా సేవే లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో కూడా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.. వచ్చీ రావడంతో హిందీ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పింక్ సినిమా రీమేక్ తో వకీల్ సాబ్ గా తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ పక్కా కమర్షియల్ యాక్ట్ తో చేసే సినిమాలు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే విడుదల ఉండేది. అయితే ఇప్పుడు పవన్ సినీ కెరీర్ లోనే ఈ ఏడాది రెండు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా యాధృచ్చికమే అంటున్నాయి సినీ వర్గాలు.

Pawan 4 | Telugu Rajyam

కానీ 2012 వ సంవత్సరంలో మాస్ హిట్ గబ్బర్ సింగ్ తో పాటు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజకీయాలతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో అలరించడానికి సిద్దమయిన వకీల్ సాబ్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీని తర్వాత డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ వండర్ సినిమా కూడా ఇదే ఏడాదిలో విడుదలవుతుందని ఫిల్మ్ టీమ్ తెలిపింది. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగనే చెప్పుకోవాలి.

పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే గుండెల్లో గుడి కట్టుకునే అభిమానులకి ఈ వార్త ఓ సంచలనంగా మారనుంది. ఎందుకంటే 2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా హిందీ రీమేక్.. అలాగే ఇప్పుడు రిలీజయ్యే వకీల్ సాబ్ సినిమా కూడా హిందీ సినిమా పింక్ రీమేక్. గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రిలీజవుతున్న వకీల్ సాబ్ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన మగువా పాటతో పాటు వకీల్ సాబ్ టీజర్ లు యూట్యూబ్ లో ట్రెండ్ ని సెట్ చేశాయి. 

- Advertisement -

Related Posts

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

Latest News