‎Pawan Kalyan: నిధి అగర్వాల్ ని చూసి సిగ్గు తెచ్చుకొని ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను: పవన్‌ కల్యాణ్‌

‎‎Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24వ తేదీన విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‎ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అన్న విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు సినిమా క్రిష్‌గారి వల్ల నా దగ్గరకు వచ్చింది. వ్యక్తిగత, వృత్తి పరమైన కారణాల వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను హ్యాండిల్‌ చేశారు. ఇక నేను డిప్యూటీని సీయంని కావచ్చు. కానీ ఈ సినిమాకు హీరోని. నిధీ అగర్వాల్‌ గారు యాక్టివ్‌ గా ఈ సినిమా ప్రమోషన్‌ చేయడం చూసి, సిగ్గు తెచ్చుకుని నేను మీడియా ఇంట్రాక్షన్‌ లో పాల్గొంటున్నాను అని హీరో పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

‎అయితే ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం హరిహర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. దాదాపుగా ఐదేళ్ల నుంచి ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది.