అగ్నిపరీక్ష ఎదుర్కోబోతున్న జనసేనాని పవన్.. ఇప్పుడు తన సత్తా చాటే సమయం వచ్చిందట.. ?

 

త్వరలో దుబ్బాకలో నవంబరు 3న ఉప ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.. ఇక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకస్మాత్తుగా మరణించడం వల్ల ఈ ఎన్నిక అనివార్యమైంది.. దీంతో ఇక్కడ మూడు పార్టీలు పోటీకి దిగినాయి.. ఈ దశలో ఇప్పటికే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మరోసారి దుబ్బాకాలో తన కారు స్పీడ్ రేంజ్ ఏంటో చూపించాలని తహతహలాడుతుండగా, గులాభిని దుబ్బాకలో వాడిపోయేలా చేయాలని కాంగ్రెస్, బీజేపీలు కలలు కంటున్నాయి.. ఇక ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున రామలింగా రెడ్డి భార్య సుజాత బరిలో దిగుతుండగా, బీజేపీ తరపున రఘునందనరావు తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నారు. కాగా సింపతీ ఓట్లపై టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ఆలోచిస్తోంది.. వీరికి కాంగ్రెస్ అభ్యర్తి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడట..

ఇంకా ఎన్నికలకు 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ టైంలో ప్రచారం మాత్రం పోటాపోటీగా జరుగుతుంది.. అయితే ఈ ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు ఎలాగైనా వేయాలని ఆలోచిస్తున్న బీజేపీ జనసేనాని పవన్‌ను దుబ్బాకలో ప్రచారానికి పంపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.. కాగా పవన్ ప్రచారం చేస్తే బీజేపీకి మరింత బలం చేకూరుతుందని కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు రావడం విశేషం. ఇదిలా ఉండగా ఏపీలో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ కి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేంత సీన్ ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అదీగాక టీఆర్ఎస్ ని పల్లెత్తు మాట అనడానికి కానీ, కేసీయార్‌న్ విమర్శించడానికి కూడా ధైర్యం చేయలేని పవన్.. బీజేపీ తరపున ఎలా ప్రచారం చేస్తారనే అనుమానం కొందరిలో వస్తుందట..

అయితే బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే మాత్రం పవన్ కచ్చితంగా ప్రచారం చేయాల్సిందే. మిత్రపక్షం కోసం ఆమాత్రం చేయకపోతే ఇక పవన్ తో వారికి ఉపయోగం ఏంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్‌కు అగ్నిపరీక్ష లాంటివని ఇప్పుడు తన సత్తా చాటే సమయం వచ్చిందని.. ఒకవేళ బీజేపీ గనుక ఇక్కడ గెలిస్తే ఆ క్రెడిట్ జనసేన ఖాతాలో పడటం ఖాయం అని అనుకుంటున్నారట జన సైనికులు.. మరి దుబ్బాక ప్రజలు ఏ తీర్పు ఇస్తారో వేచి చూడాలి..